Home / క్రీడలు / కబడ్డీమే సవాల్‌!
Telugu Titans-Kabaddi

కబడ్డీమే సవాల్‌!

12 జట్లు…13 వారాలు…138 మ్యాచ్‌లు… అభిమానులను అలరించేందుకు ప్రొ కబడ్డీ లీగ్‌ మళ్లీ వచ్చేసింది. నాలుగు సీజన్ల పాటు విజయవంతంగా వినిపించిన ఈ కూత మరోసారి వినిపించేందుకు రంగం సిద్ధమైంది. కొన్ని స్వల్ప మార్పులు, కొత్త హంగులతో కబడ్డీ ఐదో సీజన్‌కు నగారా మోగింది. హైదరాబాద్‌లోనే నేడు జరిగే ఆరంభోత్సవం తర్వాత దాదాపు మూడు నెలల పాటు కబడ్డీ అభిమానులకు ఫుల్‌ వినోదం లభించడం ఖాయం. మరోవైపు తెలుగు ఆటగాడు ఒక్కడైనా లేని తెలుగు టైటాన్స్‌ జట్టును ఈసారైనా విజయం వరిస్తుందా చూడాలి.

ప్రొ కబడ్డీ లీగ్‌ ఐదో సీజన్‌ నేడు ప్రారంభం కానుంది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ జట్టు తమిళ్‌ తలైవాస్‌తో తలపడుతుంది. గత నాలుగు సీజన్ల వరకు టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు ఉండగా ఈ సారి అదనంగా మరో నాలుగు జట్లను చేర్చారు. గతంతో పోలిస్తే ఫార్మాట్‌లో స్వల్ప మార్పులు చేశారు. జట్లను ఎ, బి జోన్‌లుగా విభజించి ఇంటర్‌ జోనల్‌ మ్యాచ్‌లు కూడా నిర్వహిస్తున్నారు. లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాక రెండు జోన్‌ల నుంచి ఆరు జట్లు సూపర్‌ ప్లే ఆఫ్‌ దశకు అర్హత సాధిస్తాయి. అక్టోబర్‌ 28న చెన్నైలో ఫైనల్‌ జరుగుతుంది.

గురువారం నగరంలో జరిగిన ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో 12 జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు.  ‘కబడ్డీ లీగ్‌ ఇప్పటికే బాగా ఆదరణ పొందింది. మరింత ఎక్కువ మందికి చేరువ చేసేందుకు జట్లు, మ్యాచ్‌ల సంఖ్యను పెంచారు. మూడు నెలల షెడ్యూల్‌ సుదీర్ఘంగా అనిపించవచ్చు. కానీ మేం ఆడేది 40 నిమిషాల మ్యాచ్‌ మాత్రమే. కాబట్టి అభిమానులకు బోర్‌ కొడుతుందనే ఆలోచన అనవసరం. ఎక్కువ మ్యాచ్‌ల నిర్వహణ కబడ్డీకి మరింత మేలు చేసేదే తప్ప నష్టపరచదు’ అని ఈ సందర్భంగా టైటాన్స్‌ కెప్టెన్‌ రాహుల్‌ చౌదరి అభిప్రాయపడ్డాడు. నేడు జరిగే ఆరంభ వేడుకలకు బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరవుతాడు.

About Gireesh Meda

I'm a student.Fascinated to Know about ongole and make Others to know..

Check Also

చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మళ్లీ చేరాయి…

నిషేధం ముగియడంతో ఐపీఎల్‌లోకి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మళ్లీ చేరాయి. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *