Home / పోలిటిక్స్ / కబాలి రాజకీయం లోకి వస్తాడా??
rajini kanth in politics..

కబాలి రాజకీయం లోకి వస్తాడా??

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న సంగతి తెలిసిదే. రజనీ ఇటీవల అభిమానుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు, ఇస్తున్న సంకేతాలు, ఆయన సన్నిహితులు చెప్తున్న మాటలు.. కచ్చితంగా రజనీ రాజకీయాల్లోకి వస్తారనే చాటుతోంది. తన తాజా చిత్రం ‘రోబో-2’ విడుదలైన అనంతరం ‘బిగ్‌ అనౌన్స్‌మెంట్‌’ చేస్తానని రజనీ సైతం ప్రకటించారు. ఆయన సొంతంగా రాజకీయ పార్టీ పెట్టే అవకాశముందని వినిపిస్తోంది. ఇదే విషయాన్ని ఆయన అల్లుడు, హీరో ధనుష్‌ను అడిగితే.. ఆయన ఒకింత దాటవేత ధోరణి అవలంబించారు.

ధనుష్‌ తాజాచిత్రం ‘వీఐపీ-2’ ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం ముంబైలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రజనీ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరముందా? అంటూ ధనుష్‌ను విలేకరులు ప్రశ్నించగా.. ‘మీరు ఆహ్వాన పత్రిక చూశారు కదా.. అందులో రాజకీయాల గురించి ప్రశ్నించకూడదని ఉంది’ అంటూ సమాధానం దాటవేయబోయారు. అయినా విలేకరులు పట్టుబట్టడంతో ధనుష్‌ స్పందించారు. నటులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరముందా? అన్న ప్రశ్నకు ‘వాళ్లు రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదనే అభిప్రాయం మీకేమైనా ఉందా? మీ అభిప్రాయం మీ దగ్గర పెట్టుకుండి. నా అభిప్రాయం నాకుంది. అది నాదగ్గరే పెట్టుకుంటాను’ అని ముగించారు.

About Vasu Ajjam

mm
I'm a Engineering Student . Interested in sharing my views and thoughts with the people. I Love to write,share and interact .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *