Home / పోలిటిక్స్ / కమల్‌హాసన్‌ను ఒక్కరోజు సీఎం చేయాలి ..

కమల్‌హాసన్‌ను ఒక్కరోజు సీఎం చేయాలి ..

సామాజిక, రాజకీయ అంశాలపై తనదైన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పే అతి కొద్ది మంది నటుల్లో అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌ ఒకరు. ఈ స్వభావమే అభిమానులకు ఆయనంటే విపరీతమైన గౌరవాన్ని పెంచింది. సాధారణ ప్రజల్లోనే కాదు సినీ ప్రముఖుల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. తాజాగా మలయాళ దర్శకుడు ఆఫోన్స్‌ పుత్రేన్‌ (‘ప్రేమమ్‌’ ఫేం) కమల్‌పై నమ్మకాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు.

శంకర్‌ దర్శకత్వం వహించిన ‘ఒకే ఒక్కడు’ చిత్రంలో అర్జున్‌ ఒక్కరోజు ముఖ్యమంత్రి అయినట్లు.. నిజ జీవితంలోనూ తమిళనాడు ముఖ్యమంత్రిగా కమల్‌హాసన్‌ ఒకరోజు ఉండాలని ఆఫోన్స్‌ అభిప్రాయపడ్డారు.

‘‘ముదల్వన్‌’ (తెలుగులో ‘ఒకే ఒక్కడు’) సినిమాలో లాగా ఒక్కరోజు ముఖ్యమంత్రిని నియమించే అవకాశం ఉంటే.. తమిళనాడు ప్రజల్ని చూసుకోవడానికి కమల్‌హాసన్‌ను ఒక్కరోజు ముఖ్యమంత్రిని చేయాలి. కేవలం ఒక్కరోజు చాలు. త్వరలో ఇది జరుగుతుందని ఆశిస్తున్నా. ఆయన తన వినూత్నమైన ఆలోచనలతో ప్రభుత్వాన్ని మరోస్థాయికి తీసుకెళ్తారు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే ఈ పిల్లాడ్ని క్షమించండి’ అని ఆఫోన్స్‌ పోస్ట్‌ చేశారు.

About Vasu Ajjam

mm
I'm a Engineering Student . Interested in sharing my views and thoughts with the people. I Love to write,share and interact .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *