Home / క్రీడలు / పుజారా అరుదైన ఘనత
Cheteshwar Pujara After His Century

పుజారా అరుదైన ఘనత

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత మిడిల్ ఆర్డర్ ఆటగాడు చటేశ్వర్ పుజారా సెంచరీ నమోదు చేశాడు. 164 బంతుల్లో శతకం పూర్తి చేసుకుని సత్తా చాటుకున్నాడు.  తన కెరీర్ లో యాభైవ టెస్టు ఆడుతున్న పుజారా అరుదైన ఘనతను సైతం సొంతం చేసుకున్నాడు. యాభై టెస్టులో శతకం సాధించిన ఏడో భారత ఆటగాడిగా పుజరా గుర్తింపు పొందాడు. ఓవరాల్ గా 36 ఆటగాడిగా పుజరా నిలిచాడు. ఇది పుజరాకు 13వ టెస్టు సెంచరీ కాగా, శ్రీలంకపై మూడో సెంచరీ.

మరొకవైపు అజింక్యా రహానే హాఫ్ సెంచరీతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అంతకుముందు కేఎల్ రాహుల్(57) హాఫ్ సెంచరీ సాధించగా, ధావన్(35) ఫర్వాలేదనిపించాడు. కాగా, కెప్టెన్ విరాట్ కోహ్లి(13) నిరాశపరిచాడు.

About Gireesh Meda

I'm a student.Fascinated to Know about ongole and make Others to know..

Check Also

చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మళ్లీ చేరాయి…

నిషేధం ముగియడంతో ఐపీఎల్‌లోకి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మళ్లీ చేరాయి. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *