Home / సినిమా ఇండస్ట్రీ / ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్న మహేశ్‌
Mahesh as Mukyamantri

ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్న మహేశ్‌

మహేశ్‌బాబు కథానాయకుడుగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్‌ భామ కైరా అడ్వానీ మహేశ్‌ సరసన నటిస్తున్నారు. ఆమె తెలుగులో చేస్తున్న తొలి చిత్రమిది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. కాగా మంగళవారం నుంచి కైరా సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మహేశ్‌-కొరటాల కాంబినేషన్లో ‘శ్రీమంతుడు’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం మంచి విజయం సాధించడం వల్ల దీనిపై ఎక్కువ అంచనాలు నెలకొన్నాయి.

ఇందులో మహేశ్‌ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ‘భరత్‌ అను నేను’ అనే టైటిల్‌ను చిత్రానికి పరిశీలిస్తున్నారు. శరత్‌కుమార్‌ మహేశ్‌ తండ్రి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు.

About Vasu Ajjam

mm
I'm a Engineering Student . Interested in sharing my views and thoughts with the people. I Love to write,share and interact .

Check Also

ఆ సినిమా రీమేక్ చేయాలనుంది

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ బర్ఫీ ని కోలీవుడ్ రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. 2012లో రిలీజ్ అయిన ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *