Home / క్రీడలు / వైట్‌వాష్‌ చేసిన కోహ్లీసేన
Indian Cricket Team After Winnng 3rd Test

వైట్‌వాష్‌ చేసిన కోహ్లీసేన

భారత విజయం పరిపూర్ణం. 3-0తో సిరీస్‌ వైట్‌వైష్‌. ఆతిథ్య శ్రీలంక పరాజయాల పరంపరకు స్వల్ప విరామం. టీమిండియాకు పరాయి గడ్డపై తొలి క్లీన్‌స్వీప్‌. లంకేయులపై వరుసగా ఇన్నింగ్స్‌ తేడాతో రెండో గెలుపు. బ్యాటింగ్‌.. బౌలింగ్‌.. ఫీల్డింగ్‌లో సమష్టిగా రాణించిన కోహ్లీసేన ప్రత్యర్థిని మూడో టెస్టులో మూడో రోజుకే ఓడించింది. ఇన్నింగ్స్‌ 171 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సమరోత్సాహంతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సన్నద్ధమైంది.మూడు టెస్టుల సిరీస్‌లో శ్రీలంకను కోహ్లీసేన వైట్‌వాష్‌ చేసింది. పరాయి గడ్డపై తొలి క్లీన్‌స్వీప్‌ ఘనత అందుకొంది. గతంలో ఏ భారత సారథికీ సాధ్యంకాని ఈ రికార్డును కోహ్లీ సాధించాడు. ఆతిథ్య జట్టుకు వారి సొంతగడ్డపైనే రెండో వైట్‌వాష్‌ ఓటమి రుచిచూపించాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒక హోం టీమ్‌ క్లీన్‌స్వీప్‌ కావడం ఇది ఏడోసారి. దీంతో టీమిండియా అరుదైన రికార్డులను బద్ధలు కొట్టినట్టైంది.

About Rohith Chilukuri

mm
I'm a student, Exicted in Posting about the places and useful information in manaongole.com, and I'm glad to Share with the people ..

Check Also

చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మళ్లీ చేరాయి…

నిషేధం ముగియడంతో ఐపీఎల్‌లోకి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మళ్లీ చేరాయి. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *