Home / చరిత్ర / సింగరకొండ-ప్రకాశం జిల్లా
Singarakonda-Prakasam District

సింగరకొండ-ప్రకాశం జిల్లా

ప్రకాశం జిల్లా లోని సింగరకొండ అద్దంకి కు 6 కి .మీ ,ఒంగోలు కు 36 కి.మీ దూరము లో ఉంది .. శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారు ఇక్కడ ప్రసిద్ధి ,స్వామి వారికి పూర్వం 14 వ శతాబ్దం లో సింగన్న అనే ఒక అమితమైన భక్తుడు ఉండేవాడు ,ఇతను అక్కడ ఉన్న కొండ ప్రాంతము లో ఒక చిన్న పల్లెటూరు లో గోవులను కాచుచూ ఉండేవాడు,అలా రోజు గోవులను తీసుకెళ్తూ ఉన్నపుడు,ఒక ఆవు చాల రోజులనుంచి పాలు ఇవ్వకపోవటం గమనించి ,ఒకరోజు ఆ ఆవును దూరముగా చెట్ల చాటున దాగుకొని గమనించాడు,ఆ ఆవు సరాసరి గా వెళ్లి కొండ మీద నుంచోని ఉంది ,ఇంతలోపు ఒక బాలుడు ఆ కొండ లో నుంచి బయటకి వచ్చి మొత్తం పాలను తాగేసెను.. ఇది గమనించిన సింగన్న ఆ బాలుడును లక్ష్మి నరసింహస్వామి గా భావించి అపారమైన భక్తి తో ఆలయమును నిర్మించెను …

17వ శతాబ్దం లో లక్ష్మి నరసింహస్వామి ఆలయముకు ధ్వజస్థంబము ను నిలపెడుతున్న సమయమున కొండకు కింది భాగం లో ఒక యోగి ప్రసన్నంజనేయస్వామి విగ్రహమును భావనాశి చెరువు సమీపం లో ప్రతిష్టించెను,ఆంజనేయుడు సీత ను వెతుకుటకు లంకకు వేళ్ళు దారిలో ఈ ప్రదేశమున ఒక రోజు విశ్రాంతి తీస్కున్నట్లు ఇక్కడి భక్తులు నమ్ముతారు ,దీని వల్లనే గుడి ముఖద్వారంలో పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం దక్షిణము వైపు ఉండటం చాల అరుదుగా చూడవచ్చు ..

కొండ పైభాగం నుంచి చూడటానికి కళ్ళకు చాల ఆనందం గా ఉంటుంది ,ఎడమ వైపు ఒంగోలు -హైదరాబాద్ హైవే,పక్కనే భావనాశి చెరువు,ఇంతటి ప్రకృతిని మనము ఎక్కడ చూడలేము అని చెపుకోవచ్చు ..

 

About Rohith Chilukuri

mm
I'm a student, Exicted in Posting about the places and useful information in manaongole.com, and I'm glad to Share with the people ..

Check Also

దొనకొండ-ప్రకాశం జిల్లా

                              …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *