Home / సినిమా ఇండస్ట్రీ / సుకుమార్‌ చేతులమీదుగా మోషన్‌పోస్టర్‌ విడుదల
Niveda Thomas & Naveen Chandra

సుకుమార్‌ చేతులమీదుగా మోషన్‌పోస్టర్‌ విడుదల

నవీన్‌చంద్ర, నివేదా థామస్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘జూలియట్‌… లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌’. అజయ్‌ వోధిరాల దర్శకుడు. కొత్తపల్లి ఆర్‌.రఘుబాబు, కె.బి.చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొత్తపల్లి అనురాధ సమర్పిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఒక లాజిక్‌తో కూడిన ప్రేమకథతో తెరకెక్కించిన చిత్రమిది. నవీన్‌చంద్ర, నివేదాథామస్‌ సహజమైన నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఈ కథలో జూలియట్‌ ఎవరు? ఆమెని ప్రేమించిన యువకుడు ఏం చేశాడన్నది తెరపైనే చూడాలి’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘సున్నితత్వంతో కూడిన అందమైన ప్రేమకథ ఇది. ఇందులోని లాజిక్‌, మేజిక్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. చిత్రీకరణ చివరి దశలో ఉంది. అజయ్‌ వోధిరాల ‘ఆర్య’ మొదలుకొని ‘100%లవ్‌’ వరకు సుకుమార్‌ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆ అనుభవంతో చిత్రాన్ని బాగా తీర్చిదిద్దారు. సుకుమార్‌ చేతులమీదుగా మోషన్‌పోస్టర్‌ విడుదల కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. అలీ, తాగుబోతు రమేష్‌, దేవన్‌, అభిమన్యు సింగ్‌, కాట్రాజ్‌, రోహిణి తదితరులు నటిస్తున్నారు.

About Vasu Ajjam

mm
I'm a Engineering Student . Interested in sharing my views and thoughts with the people. I Love to write,share and interact .

Check Also

ఆ సినిమా రీమేక్ చేయాలనుంది

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ బర్ఫీ ని కోలీవుడ్ రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. 2012లో రిలీజ్ అయిన ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *