Home / క్రీడలు / స్మ్రితి అందానికి కుర్రగాళ్ళు ఫిదా ..
Smriti mandhana

స్మ్రితి అందానికి కుర్రగాళ్ళు ఫిదా ..

ఇంగ్లండ్ లో జరుగుతున్న మహిళల వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లను అభిమానులు క్రమం తప్పకుండా చూస్తున్నారట. అందులోనూ భారత్ ఆడే మ్యాచ్లను అస్సలు మిస్ కావడం లేదట. అంటే, మన మహిళా క్రికెట్ కు మంచి రోజులు వచ్చినట్లే అనుకుంటున్నారా. అయితే ఇక్కడ మీరు పొరబడినట్లే. ఆ మ్యాచ్లను చూసేది భారత మహిళా ఓపెనర్ స్మృతి మంధనా కోసమట. వన్డే వరల్డ్ కప్ లో ప్రత్యర్థి జట్లకు కొరకరాని కొయ్యగా తయారైన మంధనకు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. భారత జట్టు మ్యాచ్ గెలిచినా, గెలవకపోయినా.. ఆమె కనిపించి ఒక నవ్వు నవ్వితే చాలు డబుల్ సెంచరీ కొట్టినంత ఆనందంగా ఉందని అంటున్నారు అభిమానులు..
ప్రస్తుతం కుర్రకారు అమితంగా ఇష్టపడే జాబితాలో మంధనకు కూడా చేరిపోయింది. ఇక్కడ సోషల్ మీడియాలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ నటి దిషా పటానిని సైతం మంధన అధిగమించేసింది. ఇప్పటి వరకూ దిషా పటాని హాట్ లుక్స్కు ఫిదా అయిపోయిన ఫ్యాన్స్.. మంధన అమాయకపు చూపులకు తమను తాము మైమరిచిపోతున్నారు. మరికొంతమందైతే అసలు దిషా పటానికి, మంధనకు పోలికా లేదని తేల్చిపారేస్తున్నారు. ‘నాకు దిషా వద్దు.. మంధననే ముద్దు’ అనేంతగా ఊహల్లో ఊరిగేపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మహిళా వన్డే వరల్డ్ కప్ లో తన పవర్ ఫుల్ బ్యాటింగ్ తో మంధన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో 90 పరుగులు చేయగా, వెస్టిండీస్ తో మ్యాచ్ లోఅజేయంగా 106 పరుగులు చేసి విజయాల్లో కీలక  పాత్ర పోషించింది.

About Rohith Chilukuri

mm
I'm a student, Exicted in Posting about the places and useful information in manaongole.com, and I'm glad to Share with the people ..

Check Also

ప్రపంచకప్‌ ఫైనల్లో భారత మహిళల జట్టుకు నిరాశ 9 పరుగులతో ఇంగ్లండ్‌ గెలుపు

ఎన్నో ఆశలు, ఎన్నో కలలు… అనుభవరాహిత్యం, ఒత్తిడి ముందు చెదిరిపోయాయి. అద్భుతాన్ని ఆశించిన జట్టు దానిని అందుకునే క్రమంలో ఎంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *