ఒంగోలు నగరము లోని కర్నూల్ రోడ్డు లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న మారుతీ నగర్ 3 వ లైన్ ఒక్కపుడు చాల మురికి గా ఉండేది ,కాలువల్లో చెత్త ,వర్షం పడినపుడు అయితే సుజాత నగర్ లో ఉన్న వర్షపు నీరు మొత్తం ఇక్కడకు చేరుతాయి ,రోడ్ల మీదే నీరు నిల్వఉండుట వలన ఇక్కడి ప్రజలకు చాల ఇబ్బంది కరంగా ఉండేది,దీని వలన దోమల సంఖ్య పెరిగి చాల రోగాలకు దారితీసేది…దీనిని అరికట్ట డానికి కాలనీ లో కొందరు డబ్బు పోగుచేసి కాలువలను బాగుచేయించారు ..
కొన్ని నెలల తరువాత 2015 మే 5 వ తేదిన లైన్ కు ప్రారంభం లో మహాత్మ గాంధీ గారి విగ్రహాన్ని అప్పటి స్వాతంత్ర సమరయోధుడైన కరవాది వెంకటేశ్వర్లు గారిచే ఆవిష్కరించారు .. అప్పటినుంచి ప్రతి సంవత్సరము వచ్చే గాంధీ జయంతి ,స్వాతంత్ర దినోత్సవము ,గణతంత్ర దినోత్సవము రోజ్జులో ప్రత్యేకంగా పూల మాలలు వేసి గాంధీగారిని గుర్తుచేసుకుంటారు ,ఈ సందర్భంగా ఆ లైను లో ఉన్న అందరికి ,రోడ్డు న వెళ్తున్న వాళ్ళకి స్వీట్లు ,చాక్లేట్లు పంచి పెట్టేవారు ..

ఆదే సంవత్సరమున సెపంబర్ 25 వ తేదిన చెట్లు పెంచె కార్యక్రమును కూడా చేపట్టారు..

రండి ఒక్కొక్కరు ఒక్కొక మొక్కను నాటుదామ్ …
భావితరాలకు హరిత లోకాన్ని సృస్తిద్దామ్ …
మొక్కే మన ఆయువు … ప్రాణం ….
అంటూ చెట్లు నాటడం మొదలెట్టారు ,రోడ్డు కు ఇరు వైపులా సుమారు వందకు పైగా చెట్లు నాటారు ,దీనికి ఆ కాలనీ వాళ్లకు లక్ష యాభై వేల దాక ఖర్చు అయ్యింది ,కావాల్సిన మొక్కలను కొన్ని ఒంగోలు మున్సిపాలిటీ వాళ్ళు ,మిగతావి చీమలమర్రి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కొని తెచ్చి చెట్లను నాటారు,ప్రతివారము మున్సిపాలిటీ నీళ్ల ట్యాంకర్ వచ్చి మొక్కలకు బాగా నీరుపట్టిస్తారు ,మొక్కలను సమ్రక్షించు కోవడానికి నెలకు ఒక్కసారి ఎరువులు వేస్తారు,రక్షణ కోసం చెట్లకు చుట్టురా ఇనప కంచెలు కూడా నిర్మించారు….

 

 

గాంధీ బొమ్మ ,చెట్లు నాటడం లో ముఖ్యం గా పాల్గోన్నది :: కృష్ణారావు గారు ,చిరంజీవి గారు ,బ్రహ్మారెడ్డి గారు ,నందనవనం సీతారామమ్మ గారు ,సామి ఆంజనేయులు గారు ,కోటా సుబ్బారావు గారు ,కోటేశ్వరరావు గారు ,యన్ . అంజయ్య గారు ,యన్ .కోదండరామయ్య గారు ,నాగేంద్ర ప్రసాద్ గారు ,కామిరెడ్డి గారు ,నారసయ్య గారు ,సుబ్బారావు గారు ,ఈదర ఆంజనేయులు గారు ,వెంకటేశ్వరరెడ్డి గారు,పెరుమాళ్ళ సుబ్బారావు గారు ,తంగెళ్లమూడి సత్యం గారు ,డా . వాసుబాబు గారు ,గురుమూర్తి గారు ,కృష్ణారెడ్డి గారు ,రోశయ్య గారు ,కోట వీరాస్వామి గారు ,సింధు బాల వెంకటేశ్వర్లు గారు ,కారణం మాధవరావు గారు ,వై . చిరంజీవి గారు ,ఆర్ టి సి కేశవరావు గారు ,గారంశెట్టి సుబ్బారావు గారు ,పి .కోటేశ్వర రావు గారు ,ఆర్ .బాల బ్రహ్మయ్య గారు …

About Rohith Chilukuri

mm
I'm a student, Exicted in Posting about the places and useful information in manaongole.com, and I'm glad to Share with the people ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *