Home / క్రీడలు

క్రీడలు

వైట్‌వాష్‌ చేసిన కోహ్లీసేన

భారత విజయం పరిపూర్ణం. 3-0తో సిరీస్‌ వైట్‌వైష్‌. ఆతిథ్య శ్రీలంక పరాజయాల పరంపరకు స్వల్ప విరామం. టీమిండియాకు పరాయి గడ్డపై తొలి క్లీన్‌స్వీప్‌. లంకేయులపై వరుసగా ఇన్నింగ్స్‌ తేడాతో రెండో గెలుపు. బ్యాటింగ్‌.. బౌలింగ్‌.. ఫీల్డింగ్‌లో సమష్టిగా రాణించిన కోహ్లీసేన ప్రత్యర్థిని మూడో టెస్టులో మూడో రోజుకే ఓడించింది. ఇన్నింగ్స్‌ 171 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సమరోత్సాహంతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సన్నద్ధమైంది.మూడు టెస్టుల సిరీస్‌లో శ్రీలంకను కోహ్లీసేన …

Read More »

పుజారా అరుదైన ఘనత

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత మిడిల్ ఆర్డర్ ఆటగాడు చటేశ్వర్ పుజారా సెంచరీ నమోదు చేశాడు. 164 బంతుల్లో శతకం పూర్తి చేసుకుని సత్తా చాటుకున్నాడు.  తన కెరీర్ లో యాభైవ టెస్టు ఆడుతున్న పుజారా అరుదైన ఘనతను సైతం సొంతం చేసుకున్నాడు. యాభై టెస్టులో శతకం సాధించిన ఏడో భారత ఆటగాడిగా పుజరా గుర్తింపు పొందాడు. ఓవరాల్ గా 36 ఆటగాడిగా పుజరా …

Read More »

కబడ్డీమే సవాల్‌!

12 జట్లు…13 వారాలు…138 మ్యాచ్‌లు… అభిమానులను అలరించేందుకు ప్రొ కబడ్డీ లీగ్‌ మళ్లీ వచ్చేసింది. నాలుగు సీజన్ల పాటు విజయవంతంగా వినిపించిన ఈ కూత మరోసారి వినిపించేందుకు రంగం సిద్ధమైంది. కొన్ని స్వల్ప మార్పులు, కొత్త హంగులతో కబడ్డీ ఐదో సీజన్‌కు నగారా మోగింది. హైదరాబాద్‌లోనే నేడు జరిగే ఆరంభోత్సవం తర్వాత దాదాపు మూడు నెలల పాటు కబడ్డీ అభిమానులకు ఫుల్‌ వినోదం లభించడం ఖాయం. మరోవైపు తెలుగు ఆటగాడు …

Read More »

ప్రపంచకప్‌ ఫైనల్లో భారత మహిళల జట్టుకు నిరాశ 9 పరుగులతో ఇంగ్లండ్‌ గెలుపు

ఎన్నో ఆశలు, ఎన్నో కలలు… అనుభవరాహిత్యం, ఒత్తిడి ముందు చెదిరిపోయాయి. అద్భుతాన్ని ఆశించిన జట్టు దానిని అందుకునే క్రమంలో ఎంతో చేరువగా వచ్చినా, చివరకు ఆ విజయం అందకుండా దూరంగా వెళ్లిపోయింది. చిరస్మరణీయ ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్‌ దృష్టిని తమ వైపునకు  తిప్పుకున్న భారత మహిళల సైన్యం చివరకు గుండె పగిలే రీతిలో ఓటమిని ఆహ్వానించింది. ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం చేజారిన అవకాశాన్ని ఈ సారి ఒడిసిపట్టుకునేలా కనిపించినా… ‘విమెన్‌ …

Read More »

చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మళ్లీ చేరాయి…

నిషేధం ముగియడంతో ఐపీఎల్‌లోకి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మళ్లీ చేరాయి. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గంట వ్యవధిలోనే లక్షల లైక్స్‌, వేల కామెంట్లతో ధోని పోస్ట్ దూసుకుపోతోంది. తమపై నిషేధం ముగిసిందంటూ శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అధికారిక ట్విట్టర్ ద్వారా అభిమానులతో ఈ శుభవార్తను షేర్ …

Read More »

ఎట్టి పరిస్థితుల్లో ధోనిని వదులుకోం!

ఆయా జట్లతో 10 ఏళ్ల ఐపీఎల్ ఒప్పందం ముగియడంతో వచ్చే ఏడాది ఐపీఎల్‌ కోసం ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు. వచ్చే ఐపీఎల్‌పై చెన్నై టీమ్ ప్రతినిధి జార్జ్‌ జాన్‌ మాట్లాడుతూ… ‘కాంట్రాక్టు ముగియడంతో ఆటగాళ్లు వేలంలో పాల్గొనాలి. అయితే ఓ ఆటగాడిని కచ్చితంగా పాత జట్టు తీసుకునే ఛాన్స్ ఉంటే మాత్రం సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనిని తీసుకుంటాం. ఈ ఏడాది పుణెతో ధోని కాంట్రాక్టు ముగుస్తుంది. జట్టును …

Read More »

సిరీస్ గెలిచారు .కానీ ….

వెస్టిండీస్ తో జరిగిన ఐదు వన్డేల సిరీస్ను భారత్ 3-1తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. చివరి వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించడంతో సిరీస్ భారత్ సొంతమైంది. అయితే విరాట్ సేన సిరీస్ ను గెలిచినప్పటికీ పాయింట్లను మాత్రం కోల్పోయింది. ఈ సిరీస్ తరువాత విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ మూడో స్థానం నిలబెట్టుకుంది. కాగా, రెండు పాయింట్లను నష్టపోయింది.   విండీస్ తో …

Read More »

స్మ్రితి అందానికి కుర్రగాళ్ళు ఫిదా ..

ఇంగ్లండ్ లో జరుగుతున్న మహిళల వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లను అభిమానులు క్రమం తప్పకుండా చూస్తున్నారట. అందులోనూ భారత్ ఆడే మ్యాచ్లను అస్సలు మిస్ కావడం లేదట. అంటే, మన మహిళా క్రికెట్ కు మంచి రోజులు వచ్చినట్లే అనుకుంటున్నారా. అయితే ఇక్కడ మీరు పొరబడినట్లే. ఆ మ్యాచ్లను చూసేది భారత మహిళా ఓపెనర్ స్మృతి మంధనా కోసమట. వన్డే వరల్డ్ కప్ లో ప్రత్యర్థి జట్లకు కొరకరాని …

Read More »

ఇండియన్ క్రికెటర్లకు నో ఛాన్స్ …

ఇది భారత క్రికెట్ అభిమానులకు నిజంగా చేదువార్తే.  తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసిన వన్డే లీడింగ్ ప్లేయర్స్ జాబితాలో ఏ ఒక్క భారత క్రికెటర్కు చోటు దక్కలేదు. 2016-17 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) జాబితాను విడుదల చేసింది. దీనిలో భాగంగా వన్డే అత్యుత్తమ ప్రదర్శనలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలతో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ జట్ల నుంచి క్రికెటర్లు చోటు దక్కించుకోగా, …

Read More »

ధోనీకి ఏమైంది? ?

ధోని మునుపటిలా ఆడలేకపోతున్న సంగతి కొన్నాళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఐపీఎల్‌-10లో కొన్ని కీలక ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ.. మొత్తంగా ధోని ప్రదర్శన సంతృప్తికరంగా అయితే లేదు. మునుపటిలా బౌలర్లపై ఆధిపత్యం చలాయించలేకపోతున్నాడు. షాట్లు ఆడలేకపోతున్నాడు. ఆరంభంలో మరీ తడబడుతున్నాడు. బంతి పదే పదే బీట్‌ అవుతుండటం అభిమానులు గమనించే ఉంటారు. ఆరంభంలో ఎలా ఆడినా.. తర్వాత పుంజుకుని, ఆడిన బంతుల కన్నా పరుగులు ఎక్కువుండేలా చూసుకునేవాడు ధోని ఒకప్పుడు. కానీ ఇప్పుడా …

Read More »